Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పడం సీఎంకు అలవాటే

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 11, 2026 11:07 AM హైదరాబాద్General
దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పడం సీఎంకు అలవాటే - Udayam
భద్రాద్రి రాముడి సాక్షిగా చేసిన రుణమాఫీ హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోలేదని భారాస నాయకుడు హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ద్వేషంతో రైతుల భవిష్యత్తును బలి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత తాగు, సాగునీటి కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణమని ధ్వజమెత్తారు. రిజర్వాయర్లు నింపకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తెలంగాణకు శాపంగా మారిందని ఆరోపించారు.

Comments

G
Loading comments...