వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించే చేనేత సేవా పథకం ఆర్థిక సహాయ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం, హెలీప్యాడ్ ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సోమవారం పరిశీలించారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు వారు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

