Back to feed
జైన్ ఫ్యాక్టరీ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
Ravi Shukla Jun 19, 2026 12:22 PM చిత్తూరు 12 viewsabout 2 hours ago

తోతాపురి మామిడికి కేజీకి రూ. 4 ప్రోత్సాహకం ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో జీడీనెల్లూరు రైతులు హర్షం వ్యక్తం చేశారు. జైన్ ఫామ్ ఫ్రెష్ ఫ్యాక్టరీ వద్ద టీడీపీ నాయకులు, రైతులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.
ప్రభుత్వం రైతులకు అండగా లేదన్న ఆరోపణలను ఈ నిర్ణయం తిప్పికొట్టిందని నాయకులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు.
Comments
Loading comments...



