వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం సమీపంలోని లిఖితపూడి, సరివల్లి గ్రామాల్లో 40 ఎకరాల్లో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.332 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వర్సిటీకి 2022 నవంబరులో శంకుస్థాపన చేశారు.
తొలిదశ భవనాల నిర్మాణానికి రూ.100 కోట్ల పరిపాలనా అనుమతి లభించింది. సీఎం చంద్రబాబు మంగళవారం పర్యటనలో పనుల పురోగతిపై స్పష్టత ఇస్తారు.
Comments
Loading comments...

