వార్తలకు తిరిగి వెళ్లండి
మెట్లే తరగతి గదులైన వైనం

భైంసా పట్టణంలోని పిప్రి కాలనీ ప్రభుత్వ పాఠశాల తీవ్ర గదుల కొరతను ఎదుర్కొంటోంది. మొత్తం 85 మంది విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో కేవలం రెండు గదులు మాత్రమే ఉండటంతో ఒకటో తరగతిని మెట్ల కింద, రెండో తరగతిని మెట్ల పైన నిర్వహిస్తున్నారు.
మిగిలిన మూడు గదులలో ఆఫీసు, 3, 4, 5 తరగతులను సర్దుబాటు చేశారు. ఈ దుస్థితి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమికి అద్దం పడుతోంది.
Comments
Loading comments...