వార్తలకు తిరిగి వెళ్లండి

చేవెళ్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా సీనియర్ ఉపాధ్యాయురాలు సయ్యద్ అజ్రానా బేగం శనివారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రిన్సిపాల్ చిన్నపురెడ్డి పదవీ విరమణ తర్వాత మహేశ్వర్‌రావుకు బాధ్యతలు ఇవ్వగా, ఉపాధ్యాయుల మధ్య సీనియారిటీ చర్చ తెరపైకి వచ్చింది.
దీంతో ఉన్నతాధికారులు సీనియారిటీ ప్రాతిపదికన అజ్రానాకు ఫుల్‌ఛార్జి అప్పగించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

