Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో లచ్చన్నకు పోలీసుల ఘన నివాళి

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 16, 2026 3:16 PM చిత్తూరుGeneral
చిత్తూరులో లచ్చన్నకు పోలీసుల ఘన నివాళి - Udayam
స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజాసేవకుడు, రైతు–కూలీల హక్కుల పోరాట యోధుడు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాషా గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌతు లచ్చన్న ప్రజల పక్షాన నిలిచిన మహనీయుడని కొనియాడారు.

Comments

G
Loading comments...