Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో భారీ కార్డన్ అండ్ సెర్చ్

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 5:11 PM చిత్తూరుక్రైమ్
చిత్తూరులో భారీ కార్డన్ అండ్ సెర్చ్ - Udayam
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా "ధైర్య స్పర్శ–ఆపరేషన్ ఫ్లష్ అవుట్"లో భాగంగా పోలీసులు 16 ప్రాంతాల్లో భారీ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో 50 మందికి పరీక్షలు నిర్వహించగా ఎవరూ పాజిటివ్‌గా తేలలేదు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 115 మద్యం బాటిళ్లు, 13 లీటర్ల ఎన్‌డీపీఎల్ మద్యం స్వాధీనం చేసుకుని 3 కేసులు నమోదు చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి కోరారు.

Comments

G
Loading comments...