Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిర్యాలలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు.

Follow Udayam on Google
Super Admin Jul 24, 2026 10:17 PM మేడ్చల్ మల్కాజిగిరి General
చిర్యాలలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. - Udayam
కీసర, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం చిర్యాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరై కేక్ కట్ చేసి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో కేటీఆర్ మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Comments

G
Loading comments...