వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరు ఎస్‌టీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం ‘పోషణ మా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీడీపీవో జయలక్ష్మి ఆధ్వర్యంలో, సూపర్‌వైజర్ ప్రియాంక సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించి తల్లులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
Comments
Loading comments...

