Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారులకు అమృత బిందువులు తల్లిపాలు

Follow Udayam on Google
p.g.murthy Aug 03, 2026 2:30 PM మంచిర్యాలGeneral
చిన్నారులకు అమృత బిందువులు తల్లిపాలు - Udayam
చిన్నారులకు అమృత బిందువులు తల్లిపాలని, వాటిని తప్పకుండా తాగించాలని లక్షెట్టిపేట మండల ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. సోమవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట మండలంలోని అంకత్ పల్లి గ్రామ అంగన్వాడి సెంటర్లో నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లతా వెంకటేష్, సూపర్వైజర్ మమత ఉన్నారు.

Comments

G
Loading comments...