Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరికలు ఇచ్చారు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 10:14 PM పల్నాడుGeneral
చిలకలూరిపేటలో రౌడీ షీటర్లకు పోలీసుల హెచ్చరికలు ఇచ్చారు - Udayam
చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ధ్యేయంగా SI సోమేశ్వరరావు రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. అడిషనల్ SP రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. నేరచరిత్ర గలవారు తమ ప్రవృత్తిని విడనాడి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. ఎవరైనా తిరిగి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...