Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపి గెడ్డపై ఎగువ కాలువ మరమ్మతులు

Follow Udayam on Google
K Anuradha Sep 02, 2026 9:13 AM శ్రీకాకుళంGeneral
చీపి గెడ్డపై ఎగువ కాలువ మరమ్మతులు - Udayam
మందస మండలం బెల్లుపటియ గ్రామం వద్ద చీపిగెడ్డపై ఉన్న ఇనుపధోని ఎగువ కాలువకు అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు పనులు ప్రారంభించారు. ఇరిగేషన్ ఏఈ ఎస్.వి. శ్రీనివాసరావు పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. కాలువకు పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...