వార్తలకు తిరిగి వెళ్లండి

ముంచంగిపుట్టు మండలంలోని పలు గ్రామాల చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు రోడ్డు సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్ల మూడు కిలోమీటర్ల మట్టిరోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది.
ద్విచక్ర వాహనాలు కూడా తిరగని ఈ దారిలో నడుస్తూ విద్యార్థులు జారిపడుతున్నారు. నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న తాము తారురోడ్డు నిర్మించాలని ఐటీడీఏ అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

