Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రాణాలను పణంగా పెట్టి స్కూళ్లకు చిన్నారులు

Follow Udayam on Google
రూప దేవి Jul 30, 2026 2:50 PM మన్యం జిల్లాGeneral
ప్రాణాలను పణంగా పెట్టి స్కూళ్లకు చిన్నారులు - Udayam
మన్యం జిల్లా కొమరాడ మండలంలో నాగావళి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 8 గ్రామాల విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలలకు వెళ్లేందుకు నదిని దాటాల్సి వస్తోంది. పడవ మరమ్మతుల్లో ఉండటంతో చిన్నారులు నీటిలో దిగి అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. వర్షాల సమయంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...