వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని మైసూరు జిల్లాలో చిప్స్ ప్యాకెట్‌లో ఉన్న ప్లాస్టిక్ బంతి గొంతులో ఇరుక్కోవడంతో మూడేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం హుణసూరు తాలూకా గౌరీపుర గ్రామంలో జరిగింది.
చిప్స్ ప్యాకెట్‌లో బహుమతిగా వచ్చిన బంతిని ఆహారంగా భావించిన బాలుడు నోట్లో వేసుకోగా అది గొంతులో ఇరుక్కుంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...
