Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలుడి అపహరణ సుఖాంతం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 04, 2026 11:41 AM కృష్ణా జిల్లాGeneral
బాలుడి అపహరణ సుఖాంతం - Udayam
మచిలీపట్నానికి చెందిన ఆరు నెలల బాలుడు అంజిరాజు అపహరణ కేసును పోలీసులు 24 గంటల్లో చేధించారు. సంతానం లేని దంపతుల కోసం రూ. లక్ష ఒప్పందంతో నిద్రిస్తున్న బాలుడ్ని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, చిన్నారిని సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Comments

G
Loading comments...