వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో వింత వాతావరణం కనిపిస్తోంది. పగలంతా రికార్డు స్థాయి ఎండలు, వడగాల్పులు వీస్తుండగా, సాయంత్రం అయ్యేసరికి పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఒకే రోజులో భిన్నమైన పరిస్థితులు ఉండటంతో అటు ప్రజలు, ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్టంగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో మూడు రోజులపాటు సుమారు 163 మండలాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Comments
Loading comments...

