వార్తలకు తిరిగి వెళ్లండి
అనపర్తి లోక్ అదాలత్‌లో 604 కేసుల పరిష్కారం

అనపర్తి జూనియర్ సివిల్ కోర్టులో శనివారం న్యాయమూర్తి వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో రికార్డు స్థాయిలో 604 కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యాయి. వీటి ద్వారా కక్షిదారులకు రూ. 1,03,95,753/- పరిహారం లభించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను ఇరువర్గాలు సఖ్యతతో ముగించుకున్నాయని న్యాయమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...