Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సవాల్ స్వీకరించలేదు

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 02, 2026 1:37 PM హైదరాబాద్General
సవాల్ స్వీకరించలేదు - Udayam
రాష్ట్ర అప్పులపై చర్చించేందుకు సిద్ధమని చెప్పి తెలంగాణ భవన్‌కు రాకుండా మంత్రి జూపల్లి కృష్ణారావు తప్పించుకున్నారని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. దమ్ముంటే గన్‌పార్క్‌కు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తే నిరూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. పోలీసులు, సంక్షేమ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని, సమర్థవంతమైన పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...