వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో ‘చబుత్రా మిషన్’లో భాగంగా రైన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. రాత్రివేళ రోడ్లపై తిరుగుతున్న యువత, ఇతరులను ఆపి వివరాలు తెలుసుకున్నారు.
అనవసరంగా అర్ధరాత్రి బయట తిరగొద్దని యువతకు కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించారు. అనుమానాస్పద కదలికలు, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకుని నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

