Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువులో పడి ఇద్దరు విద్యార్థుల మృతి

Follow Udayam on Google
sudheer Aug 03, 2026 11:55 PM కరీంనగర్క్రైమ్
చెరువులో పడి ఇద్దరు విద్యార్థుల మృతి - Udayam
జగిత్యాల జిల్లా మల్యాల మండలం వడ్డెరకాలనీ బాలుర వసతిగృహానికి చెందిన ఇద్దరు విద్యార్థులు సమీపంలోని చెరువు కుంటలో పడి మృతిచెందారు. నాలుగో తరగతి చదువుతున్న జగన్నాథం సుశాంత్‌, ఐదో తరగతికి చెందిన వనం విష్ణు శౌచాలయానికి వెళ్లొస్తామని చెప్పి బయటకు వెళ్లారు. కుంట వద్ద దుస్తులను గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...