వార్తలకు తిరిగి వెళ్లండి

చెరుకు సాగు విస్తీర్ణం పెంచటానికి రైతులకు సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర చెరుకు రైతుల సంఘం నాయకులు సూర్య ప్రకాష్ కోరారు.
ఈ మేరకు ఆదివారం విజయనగరం జిల్లా రాజాం MLA కొండ్రు మురళిమోహన్, చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకట్రావును కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా చెరుకు రైతుల సమస్యను CM దృష్టికి తీసుకెళ్తామని ఇరువురు MLAలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రమణ, కృష్ణారావు, పాల్గొన్నారు.
Comments
Loading comments...

