వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం చేయూత, సామాజిక భద్రతా పింఛన్లకు కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాజంపేట్ ఎంపీడీఓ సూర్య తెలిపారు.
మొదటి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, తలసేమియా, సికిల్సెల్, హీమోఫీలియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు ధ్రువపత్రాలతో ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

