వార్తలకు తిరిగి వెళ్లండి
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం తామరపులోవలో ప్రాథమిక పాఠశాల లేక చిన్నారులు రోజూ 2 కి.మీ నడిచి ఉధృత వాగును దాటి బడికి వెళ్తున్నారు. వంతెన లేకపోవడంతో వర్షాలకు వాగు ఉప్పొంగుతున్నా దానిని దాటాల్సి వస్తోంది.
చిన్నారులు వాగు దాటుతుండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వంతెన నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

