వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వాట్సప్ వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మాల్‌వేర్ దాడులకు పాల్పడుతున్నారని ప్రభుత్వ సంస్థ ‘సెర్ట్-ఇన్’ (Cert-In) హెచ్చరించింది. హ్యాక్ చేసిన అకౌంట్ల ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యుల పేరుతో విజువల్ బేసిక్ స్క్రిప్ట్ (.vbs) ఫైళ్లను పంపుతున్నారు.
ఈ అటాచ్‌మెంట్లను ఓపెన్ చేస్తే డివైజ్ పూర్తిగా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లి, పాస్‌వర్డ్‌లు చోరీకి గురవుతాయి. కాబట్టి, ఎలాంటి ఫైల్స్ వచ్చినా పంపిన వ్యక్తిని ఫోన్ ద్వారా ధ్రువీకరించుకోవాలని సూచించింది.
Comments
Loading comments...

