వార్తలకు తిరిగి వెళ్లండి

పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి చిత్తూరు వెళ్తున్న కారు, కుక్కను తప్పించబోయి అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

