వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ దరఖాస్తుకు ప్రభుత్వం రూ.40 మాత్రమే రుసుము నిర్ణయించిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధిక రుసుము వసూలు చేసిన మీసేవ కేంద్రాల ఐడీలను వెంటనే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు నిర్ణీత రుసుముకే సేవలు పొందాలని, ఎక్కడైనా ఎక్కువ వసూలు చేస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

