వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో భారత ఐటీ, డిజిటల్ సేవల కంపెనీలు ఎదుర్కొంటున్న వ్యాపార అడ్డంకులను తొలగించేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. లైసెన్సులు, డేటా నిబంధనలు, సైబర్ భద్రత, వీసాలు, వర్క్ పర్మిట్ల జారీలో జాప్యంపై పరిశ్రమ ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తోంది.
చైనా ఏటా 300 బిలియన్ డాలర్ల సేవలను దిగుమతి చేసుకుంటుండగా.. 2024లో భారత వాటా 8.95 బిలియన్ డాలర్లకే పరిమితమైంది.
Comments
Loading comments...

