Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడికి జైలు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 14, 2026 9:55 PM ఖమ్మంGeneral
చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడికి జైలు - Udayam
మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడు అపహరించిన కేసులో నిందితుడికి కోర్టు మూడేళ్ల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది జనవరి 8న ఖమ్మం రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో లలిత అనే మహిళ నుంచి 20 గ్రాముల బంగారు పుస్తెలతాడు అపహరించిన ఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఈదరబోయిన సుమన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి అర్వా ప్రవీణ్ శిక్షతోపాటు జరిమానా విధించారు.

Comments

G
Loading comments...