Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 10, 2026 2:28 PM హన్మకొండ General
బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు - Udayam
వరంగల్ జిల్లా పరకాల ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిపోకు చెందిన మొత్తం 80 బస్సుల్లో, 53 బస్సులను ఖమ్మం జిల్లాలో జరిగిన సీఎం సభ కోసం తరలించడంతో తీవ్ర బస్సుల కొరత ఏర్పడింది. హైదరాబాద్, హనుమకొండ, భూపాలపల్లి వంటి రూట్లలో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. దీంతో చేసేదేమీ లేక పలువురు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

Comments

G
Loading comments...