వార్తలకు తిరిగి వెళ్లండి
లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కట్టంగూర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రెడీమిక్స్ లారీని ఢీకొట్టింది. బస్సు టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఇందులో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కట్టంగూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...