Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 07, 2026 5:38 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విద్యార్థులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం - Udayam
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం వద్ద గురుకులం పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. పాఠశాల ముగిసిన అనంతరం విద్యార్థులను తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులను స్థానికులు స్పందించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...