వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. చెన్నై నుంచి విశాఖ వెళ్తున్న బస్సు డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురికాగా, 12 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బస్సును వెనుక నుంచి ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

