Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి భుజాలపై పుస్తకాల భారం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 08, 2026 11:16 AM కామరెడ్డిGeneral
చిన్నారి భుజాలపై పుస్తకాల భారం - Udayam
ప్రైవేటు పాఠశాలల్లో మూడేళ్ల పిల్లలకు కూడా బ్యాగుల మోత తప్పడం లేదు. నిబంధనల ప్రకారం ప్రీ-ప్రైమరీ చిన్నారులకు బ్యాగులు ఉండకూడదు. కానీ పాఠశాలలు అవసరం లేని సిలబస్‌ను అంటగట్టి, అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, విద్యార్థులు తమ వయసు కంటే ఎక్కువ బరువున్న బ్యాగులను మోస్తున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని యాజమాన్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...