వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి ఆర్టీసీ బస్టాండ్‌లో వాహనాల పార్కింగ్‌పై ఆర్టీసీ డీఎం చలపతి, ఎస్‌ఐ నాగార్జున ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు, ఆటోలను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపివేయాలని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘించి రాకపోకలకు ఆటంకం కలిగిస్తే ఈ-చలాన్లు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.
Comments
Loading comments...

