Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 05, 2026 8:52 PM జాతీయంక్రైమ్
భీమవరంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య - Udayam
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కొత్తపల్లి అనంతవాణి(32) దారుణ హత్యకు గురైంది. ఐదేళ్లుగా తనతో సన్నిహితంగా ఉంటున్న వివాహితుడైన ఆటో డ్రైవర్ శ్యాంబాబు ఆమెను కత్తితో పొడిచి చంపాడు. గత ఆరు నెలలుగా ఆమె తనను ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతుందన్న కక్షతో, శనివారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి అడ్డువచ్చిన తండ్రిని పక్కకు నెట్టి ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమవరం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...