వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా రేవల్లిలో యాదయ్య అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. ఇతడు క్షుద్రపూజలు చేస్తున్నాడనే అనుమానంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని గ్రామస్తులు భావిస్తున్నారు.
ఘటనా స్థలంలో మద్యం సేవించిన ఆనవాళ్లు లభించడంతో, పోలీసులు ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
Comments
Loading comments...

