వార్తలకు తిరిగి వెళ్లండి

పాస్‌పోర్టు, పౌరసత్వంపై అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. చట్టాలను తప్పుగా చిత్రీకరించడం మానుకోవాలని, నిరాధార ఆరోపణలు చేసే ముందు సంబంధిత చట్టాలను అధ్యయనం చేయాలని ఒవైసీకి హితవు పలికారు.
భారత పాస్‌పోర్టు పౌరసత్వానికి ఏకైక ఆధారం కాదని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో ఆందోళన కలిగించేలా మాట్లాడటం తగదని, రాజ్యాంగ పదవుల్లో ఉన్న నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
Comments
Loading comments...

