Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ రిసార్ట్ కోసం ప్రభుత్వ భూమిలో మట్టి దోపిడీ

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jun 27, 2026 2:11 PM రంగారెడ్డి General
ప్రైవేట్ రిసార్ట్ కోసం ప్రభుత్వ భూమిలో మట్టి దోపిడీ - Udayam
మొయినాబాద్ మండలం కనకమామిడిలో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమి నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. సర్వే నంబర్ 510లో జేసీబీల సాయంతో మట్టిని తవ్వి, సమీపంలోని ప్రైవేట్ రిసార్ట్ పార్కింగ్ స్థలం కోసం తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...