Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్‌ఎస్ ‘యువ సంగ్రామ సభ’కు బ్రేక్

భరత్ తేజ Jul 17, 2026 2:46 PM హైదరాబాద్about 1 hour ago
బీఆర్‌ఎస్ ‘యువ సంగ్రామ సభ’కు బ్రేక్ - Udayam Digital
తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘యువ సంగ్రామ సభ’కు పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా ఈ నిర్ణయం తీసుకుందని గులాబీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరూర్‌నగర్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక సీఎంవో ఒత్తిడితోనే అనుమతి రద్దు చేశారని నేతలు ఆరోపించారు. ఈ ఆంక్షలపై న్యాయపోరాటం చేస్తామని, తక్షణమే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు బీఆర్‌ఎస్ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...