Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు గ్యారంటీల అమలుకు బీఆర్ఎస్ వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 4:28 PM సంగారెడ్డిGeneral
ఆరు గ్యారంటీల అమలుకు బీఆర్ఎస్ వినతి - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నారాయణఖేడ్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి సబ్‌ కలెక్టర్ కార్యాలయం వరకు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరుతూ సబ్‌ కలెక్టర్ ఉమా హారతికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...