Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ సన్నాహక సమావేశానికి పిలుపు

Follow Udayam on Google
Rajdeep Sardesai May 28, 2026 4:16 PM నిజామాబాద్General
బీఆర్ఎస్ సన్నాహక సమావేశానికి పిలుపు - Udayam
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. మద్నూర్‌లో శుక్రవారం జరగనున్న సన్నాహక సమావేశానికి జుక్కల్ నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. ఆన్‌లైన్ సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఎండల దృష్ట్యా జాగ్రత్తలు పాటిస్తూ సమావేశానికి రావాలని, నూతన యూత్ కమిటీ సభ్యులు సీనియర్లతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...