వార్తలకు తిరిగి వెళ్లండి
బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వద్దిరాజు: కేటీఆర్‌తో భేటీ

బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపికైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన కేసీఆర్, కేటీఆర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కేఆర్ సురేశ్‌రెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో వద్దిరాజును ఎంపిక చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల గొంతును బలంగా వినిపిస్తానని, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...