Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్సెరాక్ట్‌ కంపెనీపై బీఆర్ఎస్‌ నేత క్రిశాంక్‌ ఆరోపణలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 10, 2026 4:49 PM హైదరాబాద్తెలంగాణ
సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు అనుముల కొండల్‌రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌పై బీఆర్ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ ఆరోపణలు చేశారు. రూ.లక్ష మూలధనం, డీపీఐఐటీ లైసెన్స్‌, ఉద్యోగులు లేకుండా సంస్థ నడుస్తోందని పేర్కొన్నారు. పటాన్‌చెరులోని ఓ ఇంటి నుంచి కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయని, కోటి రూపాయల విదేశీ మారకద్రవ్య ఆదాయం రావడంపై అనుమానాలు ఉన్నాయని క్రిశాంక్‌ తెలిపారు.

Comments

G
Loading comments...