వార్తలకు తిరిగి వెళ్లండి

నాంపల్లి పోలీసులు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను తెలంగాణ భవన్‌లో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతోనే అరెస్ట్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
అరెస్ట్ అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ తనను జైలుకు పంపాలని చూస్తున్నారని, చట్టాన్ని గౌరవించి పోలీసులకు సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

