Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు విస్తృత తనిఖీలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 04, 2026 3:09 PM రాజన్న సిరిసిల్లGeneral
డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు విస్తృత తనిఖీలు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు నార్కోటిక్‌ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేటలో పాఠశాలలు, కిరాణా దుకాణాలు, పాన్‌ షాపుల్లో నార్కోటిక్‌ జాగిలాలతో తనిఖీలు చేపట్టి అప్రమత్తం చేశారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ, డ్రగ్స్‌ లేదా గంజాయి విక్రయం, రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు లేదా తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని కోరారు.

Comments

G
Loading comments...