వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాకు చెందిన 'షాడో ఫ్లీట్' చమురు ట్యాంకర్ ‘స్మిట్రోస్’పై బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ సోదాలు నిర్వహించింది. రష్యాపై ఆంక్షలను ఉల్లంఘించారనే ఆరోపణలతో 38 ఏళ్ల భారతీయ పౌరుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కామెరూన్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌకను బ్రిటన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నౌకలోని 24 మంది సిబ్బందిని విచారిస్తున్నామని, అరెస్టయిన భారతీయుడిపై మరిన్ని వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

