Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో 15 ఏళ్ల బాలుడు అదృశ్యం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 1:34 PM రంగారెడ్డి General
శంషాబాద్‌లో 15 ఏళ్ల బాలుడు అదృశ్యం - Udayam
శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. పెద్ద గోల్కొండకు చెందిన యాదగిరి కుమారుడు నవతేజ్ పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 5న ఆలస్యంగా ఇంటికి రావడంతో తండ్రి మందలించాడు. 6న ఉదయం వాష్‌రూమ్‌కు వెళ్లిన నవతేజ్ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...