వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించి, ఎన్నికల హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు ఇచ్చోడ అంబేడ్కర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు.
పెండింగ్‌లో ఉన్న అర్హుల సాయాన్ని వెంటనే విడుదల చేయాలని, రైతు బీమా ప్రీమియం చెల్లించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

